ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (14:03 IST)

ముంబైలో పెరిగిపోతున్న మీజిల్స్ - ఒకే రోజు కొత్తగా 13 కేసులు

measles
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తట్టు (మీజిల్స్)వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుంది. మంగళవారం 20 మందికి ఈ వ్యాధి సోకగా, కొత్తగా మరో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదకరమైన వైరస్ వల్ల ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయినట్టు బృహైన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. 
 
బుధవారం ఒక్క రోజే నగర వ్యాప్తంగా ఏకంగా 30 మంది మీజిల్స్ లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చేరినట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే, 22 మంది కోలుకున్నారని వెల్లడించింది. 
 
మురో 156 మందిలో జ్వరం, దుద్దర్లు వంటి లక్షణాలు గుర్తించినట్టు వెల్లడించింది. గత 24 గంటల్లో నగర వ్యాప్తంగా 3.04 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించినట్టు తెలిపింది. ఈ సర్వేలో నగర వ్యాప్తంగా ఏకంగా 3,534 మీజిల్స్ కేసులను 22 ప్రాంతాల్లో గుర్తించినట్టు తెలిపారు. 
 
మీజిల్స్ వ్యాధి గ్రస్తుల కోసం ప్రభుత్వ దావఖానాల్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ వైరస్ బారినపడుతున్న వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా 370 పడకలను కేటాయించినట్టు పేర్కొంది.