గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: బుధవారం, 16 నవంబరు 2022 (17:52 IST)

పెళ్లి పీటలెక్కనున్న మిల్కీ బ్యూటీ?

sye raa tamannah
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా పెళ్లి పీటలెక్కనున్నారు. ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. పైగా, ఈ ప్రచారాన్ని ఈమె ఇంతవరకు ఖండించలేదు. అయితే, తమన్నా ప్రస్తుతం చిరంజీవి చిత్రంలో నటిస్తున్నారు.
 
ఇదిలావుంటే, ముంబై వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం వల్లే ఆమె కొత్తగా సినిమాలు సమ్మతించడం లేదనే ప్రచారం సాగుతోంది. ముంబైకు చెందిన తమన్నా.. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరుగడించారు. 
 
14 యేళ్ళ వయసులోనే నటించడం ప్రారంభించిన తమన్నా ప్రస్తుతం "భోళా శంకర్" చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు.