గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (11:03 IST)

కుమార్తెకు శ్రీకృష్ణుడుతో పెళ్లి జరిపించిన తండ్రి...

kirhsna marriage
వినికిడి శబ్దంతో బాధపడుతూ మాట్లాడలేని దివ్యాంగురాలైన తన కుమార్తెకు ఓ తండ్రి వివాహం చేశాడు. అదీకూడా శ్రీకృష్ణుడుతో. ఈ వివాహానికి బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించి పెళ్లి విందును కూడా ఆరగించి వెళ్లారు. ఇపుడు ఈ పెళ్లి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌కు చెందిన శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. ఆమె మాట్లాడలేదు. చెవులు వినిపించవు. 21 యేళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆమెను ఆ తండ్రి అంత ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. అయితే, కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్న ఆయన.. తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేసేలా ముహూర్తం నిర్ణయించాడు. 
 
ఈ పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలంటూ తన బంధువులకు కుబురు పంపాడు. శ్రీకృష్ణుడుతో వివాహం అనగానే బంధువులంతా ఆశ్చర్యపోయారు. పెళ్లికి ముందు మామూలుగానే మెహందీ వేడుక, విందు, ఊరేగింపు నిర్వహించారు. 
 
ఆ తర్వాత ఓ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి శ్రీకృష్ణుడు వేషధారణలో ఉన్ అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆశీర్వదించి, ఈ వివాహ వేడుక ఘనంగా జరిగేలా పూర్తి చేశారు. ఈ పెళ్లి వేడుక ఇపుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.