బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (22:22 IST)

బెండకాయలో జిగురును దూరం చేయాలంటే..

బెండకాయలో జిగురును దూరం చేయాలంటే.. బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే సరిపోుతుంది. అరటికాయ. ముక్కలు నల్లబడకుండా వుండాలంటే వాటిని తరిగిన తర్వాత మజ్జిగలో వేస్తే సరి. వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి బాగుంటుంది. 
 
ఆమ్లెట్‌కు అదనపు రుచి రావాలంటే సొనకు కొబ్బరి కోరు జోడించాలి. తేనె సీసాలో నాలుగైదు మిరియాలు చేస్తే చీమలు చేరవు. అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. కరివేపాకుని ఎండబెట్టి పొడిచేసి, భద్రపరుచుకుని నిత్యం కూరల్లో  వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.