మంగళవారం, 23 జులై 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (22:12 IST)

ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు ఉంచకూడదు, ఎందుకో తెలుసా?

ఫ్రిడ్జ్‌లో కొన్ని పదార్థాలను పెట్టకూడదు. నిల్వ వుంచదగినవి మాత్రమే పెట్టాలి. కొన్నింటిని పెడితే అవి హానికరంగా మారుతాయి. ఉదాహరణకు బంగాళదుంపలు. వీటిని ఫ్రిజ్‌లో పెడితే మొలకెత్తుతాయి. వాటిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం అంటారు.
 
 
చాలామంది వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి దెబ్బతింటుంది. వెల్లుల్లి చాలా చల్లగానూ లేదా చాలా వేడిగానూ ఉంచకూడదు. అలాగే తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.

 
కొందరు అరటిపండు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే అరటిపండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నల్లగా మారుతుంది కాబట్టి బయట ఉంచడం మంచిది.