పచ్చని అరటిపండ్లతో బరువు, మధుమేహం మటాష్
బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఆకుపచ్చని అరటి పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణం బాగా జరుగుతుంది. ఆకుపచ్చని అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఎ మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి.
ఆకుపచ్చ అరటిపండులో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. తలనొప్పి, చెస్ట్ పెయిన్, ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి సమస్యలని కూడా ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఆకుపచ్చని అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. కార్డియో వాస్క్యూలర్ సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.