1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 అక్టోబరు 2021 (22:34 IST)

మధుమేహం వున్నవారు ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే....

మధుమేహం వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం కాస్త తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. అలాగే నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే షుగరు తగ్గుతుంది.
 
లేత మునగాకుని కూరలా వండుకుని తింటే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. చిన్నపిల్లలకి రాత్రిళ్లు పక్కలో మూత్రం పోసే అలవాటు ఉంటే, ఈ కూర పెట్టడం మంచిది.
 
రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంటే కరక్కాయ చూర్ణాన్ని ప్రతిరోజూ క్రమం తప్పక తేనెతో తీసుకోవడం మేలు.
 
మునగచెట్టు వేరును బాగా దంచి రసం తీసి దానిలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి.