శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 21 జనవరి 2022 (23:04 IST)

శరీరంలో చెడుకొవ్వును చేర్చే పదార్థాలు ఏమిటి?

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో చేరితే అది ఊబకాయం, గుండె జబ్బులకు దారి తీస్తుంది.


దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్‌ను చెడు కొవ్వుగా వర్ణించబడింది. ఈ చెడు కొవ్వు ధమనుల పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పదార్థాలు ఏమిటో చూద్దాం.

 
నూనెలో వేయించిన పదార్థాలు జోలికి వెళ్లకపోవడం మంచిది. అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్లయితే, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అదనపు ఉప్పు, నూనె ఆహారాలు పోషకాలను కలిగి ఉండవు. వీటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.

 
బేకరీ ఫుడ్స్.... ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచే కేకులు, ఐస్ క్రీం, పేస్ట్రీలు, స్వీట్లను బేకరీ ఫుడ్స్ దూరంగా పెట్టాలి. ఇవి తరచుగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది మధుమేహం, గుండె జబ్బులు, ఇతర శారీరక రుగ్మతలకు కూడా కారణమవుతుంది. వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఊబకాయం వంటి శారీరక రుగ్మతలకు దారితీస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ తినేవారు వీటిని తగ్గించుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చు.