భారతీయ వంటకాలకు సరికొత్త రుచులనందిస్తున్న అజినోమోటో
తీపి, పులుపు, ఉప్పు, చేదు రుచులను గురించి అందరికీ తెలుసు. కానీ వీటన్నిటినీ మించిన రుచి... ఉమామి గురించి ఎందరికి తెలుసు? ఎలాంటి వంటకం అయినా అంటే, భారతీయ కూరలు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేదంటే నూడిల్స్‌కు కూడా అద్భుతమైన ఉమామి రుచి అందించాలంటే అజి–నో–మోటో (ఎంఎస్‌జీ) జోడించాల్సిందే.
వంటకాలకు అజినోమోటో జోడించడం ద్వారా రుచి మెరుగుపడటంతో పాటుగా ఆరోగ్య పరంగానూ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. మరీముఖ్యంగా వంటకాలలో ఉప్పు వినియోగం 30% వరకూ తగ్గించవచ్చు. తద్వారా రక్తపోటు, హృద్రోగ రోగులకు ప్రయోజనమూ కలుగుతుంది. వృద్ధులలో ఆకలిని సైతం ఇది పెంచుతుంది.
వంటకాల రుచిని పెంపొందించే మోనో సోడియం గ్లుటమేట్‌ను అజినో మోటో బ్రాండ్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తుంది అజినో మోటో సంస్థ. జపాన్‌కు చెందిన ఈ సంస్థ సహజసిద్ధమైన చెరుకు, టాపియోకాల కిణ్వన ప్రక్రియ ద్వారా మోనోసోడియం గ్లుటమేట్ తయారుచేస్తుంది. దీనిలో ఎలాంటి రసాయనాలు జోడించరు. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలో అజినోమోటో విస్తరించడమే కాదు, 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కూడా ఈ బ్రాండ్‌కు ఉంది.
అయితే ఇటీవలి కాలంలో చైనా ఉత్పత్తులతో పాటుగా స్థానిక తయారీ సంస్థలు అజినోమోటో పేరిట నకలీలను మార్కెట్లో వదులుతున్నారు. ఇలాంటి ఉత్పత్తుల పట్ల వినియోగదారులు ఆప్రమప్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అజినోమోటో ఇండియా అధికార ప్రతినిధి గోవింద బిశ్వాస్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ తల్లిపాలలో ఉండే గ్లూటమేట్ తమ అజినోమోటోలో ఉంటుందని, శిశువులు కూడా నిరభ్యంతరంగా తమ ఉత్పత్తులను వినియోగించవచ్చన్నారు. అజినోమోటోతో పాటుగా తాము ఫ్రైడ్‌రైస్‌ను అలంకరించుకునేందుకు హపిమా ఫ్రైడ్ రైస్ మిక్స్ , ఇంటి వద్దనే రెస్టారెంట్ తరహా చికెన్‌కర్రీ వండుకోవడం కోసం హపిమా క్రిస్పీ ఫ్రై మిక్స్ మరియు ఏ అండ్ ఎం నూడిల్స్‌ను సైతం మార్కెట్‌లో విడుదల చేశామన్నారు.
దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించబోతున్నామంటూ దీనికోసం తమ డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను సైతం గణనీయంగా విస్తరించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.