ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (16:04 IST)

రిమోట్ కంట్రోల్ కారు ఆర్డరిస్తే.. పార్లీ జీ బిస్కెట్ వచ్చింది..

Parle G
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్లిచ్చిన వస్తువులు బదులుగా వేరొక వస్తువులు రావడం సాధారణమే. తాజాగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చినవాటికి బదులుగా ఏవేవో రావటం అవి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓ రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిస్తే డెలివరీ ప్యాకింగ్‌లో 'పార్లే-జీ' బిస్కెట్ ప్యాకెట్ రావటం చూసి షాక్ అయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని భగవాన్ నగర్ ఆశ్రమ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ బురాగోహైన్ అనే వ్యక్తి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో పిల్లలు ఆడుకునే ఓ రిమోట్ కంట్రోల్ కారు ఆర్డరిచ్చారు. సోమవారం ప్యాకింగ్ కూడా వచ్చింది. దాన్ని విప్పి చూడగా..'పార్లే-జీ' బిస్కెట్ ప్యాకెట్ ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని విక్రమ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
 
దానికి విక్రమ్ కూడా ఫన్నీగా 'అమెజాన్‌లో ఆర్డరిచ్చిన దానికి బదులు పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ వస్తే.. ఇక చాయ్ పెట్టుకోవాలి'' అంటూ జోక్ చేశాడు. దానికి నెటిజన్లు మాత్రం ఊరుకుంటారా? ఏదోక ఫన్నీ కామెంట్ పెడతారుగా.. అలా ఓ నెటిజన్ '' పిల్లాడే కదా తీసుకునేది.. పార్లే-జీ పంపితే సరిపోతుంది అనుకున్నారేమో?'' అంటూ కామెంట్ పెట్టారు.