శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 మే 2021 (13:31 IST)

జగన్ ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి నానా హింసలు: నారా లోకేష్ ట్వీట్

డాక్టర్ సుధాకర్ మృతిపై తెదేపా నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు.
 
''డాక్టర్ సుధాకర్ గారి మృతి న‌న్ను తీవ్ర‌దిగ్ర్భాంతికి గురిచేసింది. మాస్క్ అడగ‌డ‌మే ద‌ళిత వైద్యుడు చేసిన నేరంగా వైఎస్ జగన్ ఆదేశాల‌తో రెక్క‌లు విరిచి క‌ట్టి, కొట్టి, నానా హింస‌లు పెట్టి పిచ్చాసుప‌త్రిలో చేర్పించ‌డంతో సుధాక‌ర్ బాగా కుంగిపోయార‌ని తెలిసింది.
 
ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివ‌రికి ఇలా అంత‌మొందించారు. ఇది గుండెపోటు కాదు. ప్ర‌శ్నించినందుకు ప్ర‌భుత్వం చేసిన హ‌త్య ఇది. నిరంకుశ స‌ర్కారుపై పోరాడిన సుధాక‌ర్‌ గారికి నివాళి అర్పిస్తున్నాను. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను.''