మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (13:17 IST)

ఎట్టెట్టా... సరిహద్దులు మూస్తే కరోనా కట్టడి కాదా? కృతజ్ఞత లేని చంద్రం!

ఏపీలోని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రాజకీయ నేతలకు వైకాపా ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ విషయం స్పష్టం చేశారు. సరిహద్దులు మూస్తే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేమని సెలవించారు. 
 
ఈ మరేకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్‌మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.
 
"కరోనా వైరస్ ఇక్కడ పుట్టింది కాదు. సరిహద్దులు మూస్తే ఆగేది కాదు. అయినా బాబు, అనుకూల మీడియా ప్రభుత్వం మీద రోజూ బురద జల్లాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో రూ.150 కోట్లు దోచుకున్న వీళ్లు ప్రజారోగ్యం గురించి దొంగ ఏడుపులు ఏడుస్తుంటే ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయంటూ" ఆయన ట్వీట్‌ చేశారు.
 
'అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలి పెట్టావు. ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకుని ఏపీ ప్రతిష్టనే దెబ్బతీసే కుట్రలు చేస్తున్నావు. ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు… చంద్రం'. అంటూ మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి మండిపడ్డారు.