గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (19:55 IST)

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభణ.. తెలంగాణలో 84మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,02,187కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 62,797కు పెరిగాయి. ఇవాళ్టివరకు 2771 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 65,923 శాంపిళ్లను పరీక్షించారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 14,968 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 16,167 మంది చికిత్సకు కోలుకున్నారు. 84 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఏపీలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 13,02,589కి పెరిగాయి. 11,04,431 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 1,89,367కు చేరాయి. 8791 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 60,124 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.