శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (14:24 IST)

విద్యుత్ ఆల్ టైమ్ రికార్డ్.. ఒక్కరోజే 14,350 వాట్ల వాడకం

electricity
తెలంగాణ రాష్ట్రంలో వేసవికాలం ప్రారంభంలోనే విద్యుత్‌కు అత్యధిక డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విద్యుత్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. శుక్రవారం గరిష్టంగా 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. 
 
ఉదయం 10 గంటల వరకు 14వేల 350 మెగా వాట్ల విద్యుత్ వాడకం జరిగింది. ఇక, గత ఏడాది మార్చి 29న తెలంగాణలో అత్యధికంగా 14,166 మెగావాట్ల విద్యుత్ వినియోగం రికార్డుగా ఉంది.
 
ఇక, తెలంగాణలో విద్యుత్ వినియోగంపై ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ.. శుక్రవారం గరిష్టంగా 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించిందని ప్రకటించారు.