1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Day after TN Governor apology, BJP leader shares FB post abusing women journalists

బుగ్గ నిమిరిన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోండి గవర్నర్‌ జీ : ఎస్వీ శేఖర్

విలేఖరుల సమావేశానికి వచ్చిన మహిళా విలేఖరి బుగ్గ నిమిరిన తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోపిత్‌కు సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత ఎస్వీ శేఖర్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. పాత్రికేయురాలి బుగ్గ నిమిరిన నేపథ్యంలో ఆ

BJP
విలేఖరుల సమావేశానికి వచ్చిన మహిళా విలేఖరి బుగ్గ నిమిరిన తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోపిత్‌కు సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత ఎస్వీ శేఖర్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. పాత్రికేయురాలి బుగ్గ నిమిరిన నేపథ్యంలో ఆయన తన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోవాలని సూచన చేశారు. ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై దుమారం రేగటంతో ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నై పాత్రికేయులు బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
 
ఇటీవల ఓ పత్రికా సమావేశంలో పాత్రికేయురాలు లక్ష్మీ సుబ్రహ్మణ్యం గవర్నర్‌ను ఓ ప్రశ్నఅడిగారు. ఆయన దానికి సమాధానాన్ని దాటవేస్తూ, ఆమె బుగ్గపై నిమిరారు. దీనిని లక్ష్మీ ఖండిస్తూ ట్వీట్ చేశారు. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, తన ఇష్టం లేకుండా, తన బుగ్గపై గవర్నర్ నిమిరారని ఆరోపించారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆమెకు క్షమాపణ చెప్పారు.
 
ఈ నేపథ్యంలో బీజేపీ నేత శేఖర్ ఫేస్‌బుక్ పోస్ట్‌ పెట్టారు. మహిళా జర్నలిస్టును ముట్టుకున్నందుకు గవర్నర్ తన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోవాలని పేర్కొన్నారు. సాక్షాత్ బీజేపీ నేతగా ఉన్న ఎస్వీ శేఖర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పదమైంది. దీంతో ఆయన తన ట్వీట్‌ను తొలగించారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
మోడీ.. బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం : బాలయ్య ఫైర్