గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (18:31 IST)

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పీఠం ఆ సామాజిక వర్గానికేనట...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిని భర్తీ చేసే పనిలో బీజేపీ అధినాయకత్వం నిమగ్నమైంది. అదేసమయంలో హరిబాబుకు బీజేపీ జాతీ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిని భర్తీ చేసే పనిలో బీజేపీ అధినాయకత్వం నిమగ్నమైంది. అదేసమయంలో హరిబాబుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.
 
నిజానికి పార్టీ జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పనున్నట్టు సమాచారం. 
 
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరును సైతం ఖరారు చేశారని, నేడో రేపో ప్రకటించనున్నారని జాతీయస్థాయిలోని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇకపోతే, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి తుది రేసులో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు మిగిలినట్టు సమాచారం. సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లను అధినాయకత్వం పరిశీలించినట్టు సమాచారం.