చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన నందమూరి హీరో..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నందమూరి హీరో ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ నందమూరి హీరో ఎవరంటారా..? కళ్యాణ్ రామ్. తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పరిపాలన గురి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నందమూరి హీరో ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ నందమూరి హీరో ఎవరంటారా..? కళ్యాణ్ రామ్. తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పరిపాలన గురించి ఏమంటారు అని అడిగితే... మామయ్య అంటే తమకు చాలా ఇష్టమని, ఆయన విజన్ ఉన్న నేత అని ప్రశంసించారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. అందుకే ప్రజాదరణ ఉన్న నేత అయ్యారని చెప్పుకొచ్చారు.
రానున్న ఎన్నికలకు ప్రచారం చేస్తారా? అని అడిగితే... తమ అవసరం పార్టీకి ఉందంటే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తాను, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నవ్యాంధ్ర సాధనకు చంద్రబాబు పాలన ఎంతో అవసరమని, ఆయన పాలన లేకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా ప్రస్తావించగా.... హోదా అంశం విషయమై పోరాటం చేయాల్సి వస్తే... తాము సిద్ధం అని తెలియచేశారు.