శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (13:48 IST)

హోదా రాదని చంద్రబాబుకు తెలుసు.. వెంట్రుకతో కొండను లాగాలని?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హోదారాదని తెలిసీ ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు ఎంపీలతో నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు.
 
ఏపీ ముఖచిత్రం మారేందుకు 2019 ఎన్నికలు చాలన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే వారికి ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్ మిషన్ ముందు ఓసారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ప్రజలకు ఉండవల్లి సలహా ఇచ్చారు. 
 
గత నాలుగేళ్లలో ఏపికి రూ.18.50 లక్షల పెట్టుబడులు ఎలా వచ్చాయని.. చంద్రబాబు చేసిన ప్రకటనను ఉండవల్లి గుర్తు చేశారు. పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పుకుంటుంటే.. ఇక హోదా, పన్ను రాయితీలు ఎందుకని ఉండవల్లి ప్రశ్నించారు.