శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:32 IST)

నాకు తెలిసిన మంచి వ్యక్తుల్లో గల్లా జయదేవ్ ఒకరు: సుమంత్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డును చేతబూనిన ఎంపీ గల్లా జయదేవ్‌పై సినీ నటుడు సుమంత్ స్పందించాడు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పీఎం నివాసం వద్ద నిరసన చేస్తున్న ఎంపీల అరెస్టు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డును చేతబూనిన ఎంపీ గల్లా జయదేవ్‌పై సినీ నటుడు సుమంత్ స్పందించాడు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పీఎం నివాసం వద్ద నిరసన చేస్తున్న ఎంపీల అరెస్టును సుమంత్ ఖండించారు.

ఎంపీ గల్లా జయదేవ్ ఫోటోను సుమంత్ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. తనకు తెలిసిన మంచి వ్యక్తులలో ఒకరైన గల్లా జయదేవ్‌కు ఈవిధంగా జరగడం చూస్తుంటే తనకు బాధగా ఉందని సుమంత్ పేర్కొన్నాడు. 
 
మరోవైపు ప్రజలందరినీ ఏకం చేసి ఏపికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఢిల్లీలో అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తామని వెల్లడించారు. 
 
అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కేంద్రం పారిపోయిందని, రాష్ట్ర విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదేనని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. ప్రధానిని కలిసేందుకు తాము వెళితే పోలీస్ స్టేషన్‌లో పెడతారా అంటూ మండిపడ్డారు.