శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (14:54 IST)

కేసీఆర్ ఆహ్వానిస్తే తెరాసలో చేరుతానంటున్న హీరో.. ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే మాత్రం ఖచ్చితంగా తెరాసలో చేరుతానని సీనియర్ హీరోల్లో ఒకరైన సుమన్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే మాత్రం ఖచ్చితంగా తెరాసలో చేరుతానని సీనియర్ హీరోల్లో ఒకరైన సుమన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎలాంటి విద్యుత్ కోతలు లేవన్నారు. ఆయన గురువారం కేసీఆర్ పాలనపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పులు చోటుచేసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కరెంట్ కోతల నుంచి తెలంగాణ ప్రజలను విముక్తులను చేశారని కొనియాడారు. 
 
ఒకరోజు ఆయనతో ఐదున్నర గంటలు గడిపే సమయం వచ్చింది. ఆ సమయంలో ఆయన రాత్రింబవళ్లు ప్రజల శ్రేయస్స గురించి ఆలోచించడాన్ని గమనించాను. ముస్లింలకు, దళితులకు ఆయన చక్కటి పదవులివ్వడం ముదావహం. కేసీఆర్‌ రమ్మంటే రాజకీయాల్లోకి వస్తాను. టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తాను. కేసీఆర్‌ ఏం చేయమంటే అదే చేస్తాను. సినిమా పరిశ్రమకు మేలు చేయమని నా వంతుగా కోరుతున్నట్టు సుమన్ తెలిపారు.