సంబంధిత వార్తలు
- 'రాజ్యం మీద ఆశలేనివాడి కంటే గొప్ప రాజు ఎవడుంటాడు'... "అజ్ఞాతవాసి"పై హైపర్ ఆది (వీడియో)
- చలపతిరావు కామెంట్స్-సూపరన్న రవి.. నాంపల్లి కోర్టుకు హాజరు
- రైల్వే జోన్‌పై ఎంపీలుగా ఏం పీకలేం... జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు
- జియో 2018 ప్లాన్, ఎయిర్‌టెల్-వోడాఫోన్ దిమ్మతిరిగే ప్లాన్... వివరాలు...
- తిరుపతిలో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ గోత్ర నామం చెప్పి...
ఎయిర్‌టెల్‌పై సెటైర్‌లు విసిరిన అక్కినేని వారసుడు
టాలీవుడ్ హీరో 'సుమంత్' ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేసారు. కాల్ డ్రాప్ సమస్యతో కస్టమర్లు విసిగిపోతున్నారని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. కాల్ డ్రాప్ సమస్యకు ఎయిర్‌టెల్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ట్విట్టర్
టాలీవుడ్ హీరో 'సుమంత్' ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేసారు. కాల్ డ్రాప్ సమస్యతో కస్టమర్లు విసిగిపోతున్నారని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. కాల్ డ్రాప్ సమస్యకు ఎయిర్‌టెల్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది.
ఈ కాల్ డ్రాప్ వ్యవహారం తనను ఎంత ఇబ్బందికి గురిచేస్తోందో సుమంత్ చెప్పకనే చెప్పారు. ఇంకా 'ఎయిర్‌టెల్ కాల్ డ్రాపింగ్ అనే కళను రెగ్యులర్‌గా ఉపయోగించడంలో విజయవంతమైందని.. అందుకు అభినందనలు..' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను టెలికాం కంపెనీల ప్రకటన తరహాలోనే ట్వీట్ చేయడం విశేషం.
నెటిజన్లు కూడా ఈ ట్వీట్‌కి స్పందిస్తూ తగు రీతిలో సెటైర్లు విసురుతున్నారు. యువకుడు, గోదావరి, గోల్కొండ హైస్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్న సుమంత్.. చాలా గ్యాప్ తర్వాత గతేడాది 'మళ్లీ రావా' అనే సినిమాలో నటించి, మంచి విజయం అందుకున్నారు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ హీరో తన తదుపరి చిత్రం ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.
