శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:24 IST)

లోకేష్ క‌ంటే రాజ‌ప్పే నెంబ‌ర్ వన్.. ఎందులో?

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప‌రిష్కారం కాకుండా పేరుకునిపోయిన ఫైళ్ల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వ‌డంతో మంత్రులు, అధికారులు ఆ ఫైళ్ళ క్లియరెన్స్‌లో నిమగ్నమైపోయారు.

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప‌రిష్కారం కాకుండా పేరుకునిపోయిన ఫైళ్ల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వ‌డంతో మంత్రులు, అధికారులు ఆ ఫైళ్ళ క్లియరెన్స్‌లో నిమగ్నమైపోయారు. అయితే, ఈ పెండింగ్ ఫైళ్ల ప‌రిష్కారంలో ఎవ‌రు ఎలా ప‌ని చేస్తున్నారో ఓ రిపోర్ట్ త‌యారు చేశారు. ఈ నివేదిక ప్ర‌కారం లోకేష్ క‌ంటే చిన రాజ‌ప్పే మొద‌టి స్ధానంలో ఉండ‌డం విశేషం. 
 
చిన రాజప్ప, లోకేష్, నారాయణలు సగటున గంట వ్యవధిలో ఫైళ్ల క్లీరెన్సు చేస్తుంటే.. మంత్రి అచ్చెన్నాయుడు రెండు గంటలు, దేవినేని ఉమా 14 గంటలు, కాల్వ శ్రీనివాసులు 15 గంటలు సగటు సమయం తీసుకుంటున్నారు. 
 
ఇకపోతే, పరిటాల సునీత సగటున ఒకరోజు 6 గంటలు, గంటాశ్రీనివాసరావు 3 రోజుల 14 గంటలు, నక్కా ఆనందబాబు ఒకరోజు 8 గంటలు, యనమల రామకృష్ణుడు 7 రోజుల 23  గంటలు, కె.ఇ.కృష్ణమూర్తి 3 రోజుల 5 గంటలు, అయ్యన్నపాత్రుడు 2 రోజుల 4 గంటలు, ఆదినారాయణ రెడ్డి 2 రోజుల 19 గంటలు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 13 గంటలు, కొల్లు రవీంద్ర 5 రోజుల 1 గంటలా సమయం తీసుకుంటున్నట్టు సమాచారం.