శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (07:17 IST)

పవన్ తొందరపడ్డారు.. ఆయన్ని విమర్శిస్తే మమ్మల్ని మేమే?: మురళీమోహన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ.. జనసేన ఆవిర్భావ సభలో విమర్శలు గుప్పించడంతో.. టీడీపీ నేతలు జనసేనానిపై ఎదురుదాడి చేస్తున్నారు. బీజేపీతో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ.. జనసేన ఆవిర్భావ సభలో విమర్శలు గుప్పించడంతో.. టీడీపీ నేతలు జనసేనానిపై ఎదురుదాడి చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కయ్యే పవన్ ఇలా మాట్లాడుతున్నారని ఏకిపారేశారు. తాజాగా చంద్రబాబు, నారా లోకేష్‌లపై పవన్ విమర్శలపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. 
 
పవన్ కల్యాణ్ తొందరపడ్డారని.. పవన్‌ను తానేమీ విమర్శించట్లేదన్నారు. పవన్‌ను విమర్శించుకుంటే తమను తాము విమర్శించుకున్నట్లేనని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని., అలాంటి నాయకుడు మనకు భవిష్యత్తులో కూడా వుండరని చెప్పిన పవన్.. ఉన్నట్టుండి బాబుపై విమర్శలు చేయడం... యూటర్న్ తీసుకోవడం తొందరపాటు చర్యేనని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు మంచి చేయాలని పవన్ కల్యాణ్ మనసులో ఉంది. కాకపోతే, ఆయనకు అంతగా అనుభవం లేకపోవడం వల్ల కానీ, సన్నిహితుల సలహాల వల్ల గానీ కొంచెం తొందరపడ్డారని మురళీమోహన్ చెప్పారు.