బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 మార్చి 2018 (18:38 IST)

'భగత్ సింగ్'తో వాళ్ల అమ్మ ఏమన్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ లేఖ

1931లో ఇదే రోజు మాతృదేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ బలిదానం చేశారు. బానిస శృంఖలాల నుంచి భారత మాతను విడిపించేందుకు, భావి తరాల కోసం తమ జీవితాలని అర్పించారు. వారి త్యాగం లక్షల మంది మనస్సుల్ని జ్వలింపజేస్తుంది. ఈ రోజుకీ ఎక్కడైనా అన్యాయంపై ఎదుర

1931లో ఇదే రోజు మాతృదేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ బలిదానం చేశారు. బానిస శృంఖలాల నుంచి భారత మాతను విడిపించేందుకు, భావి తరాల కోసం తమ జీవితాలని అర్పించారు. వారి త్యాగం లక్షల మంది మనస్సుల్ని జ్వలింపజేస్తుంది. ఈ రోజుకీ ఎక్కడైనా అన్యాయంపై ఎదురుతిరగడంలో ఆ త్యాగధనుల జీవితాలు ఇచ్చిన స్ఫూర్తే వుంటుంది. 
 
ఉరి కంబాన్ని ఎక్కే కొద్ది రోజుల ముందు భగత్ సింగ్ తన మాతృమూర్తితో ఇలా అన్నారు. "నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకుంటే భారతదేశంలో వున్న మాతృమూర్తులు అందరూ తమ బిడ్డలు భగత్ సింగ్‌లా కావాలని కోరుకుంటారు. బలీయమైన స్వాతంత్ర్య కాంక్ష వున్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవయోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు... 
 
అప్పుడు భగత్ సింగ్ తల్లి ఇలా స్పందించారు, ''ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. గొప్ప మరణం అనేది ఎలా వుంటుంది అంటే... ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకుంటుంది'' అని. తన బిడ్డ ఉరి కొయ్యని ముద్దాడే ముందు ఇంక్విలాబ్ జిందాబాద్ అనిపించిందా మూర్తి.
 
భగత్ సింగ్ ఔన్నత్యాన్ని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ విధంగా వివరించారు. "మేధావి అనే పదానికి అసలైన అర్థం ఏమిటంటే... ఏ వ్యక్తి అయితే గొప్ప ఆలోచనలతో పరితపించాలి. భవిష్యత్ తరాల కోసం, జనం కష్టాల పట్ల స్పృహతో, వారి సంక్షేమం కోసం స్వతంత్రమైన ఆలోచనలతో స్పష్టమైన ప్రణాళిక కలిగి వుండాలి. మేధావి అని సాధికారికంగా భగత్ సింగ్‌ని పిలిచేందుకు అన్ని అర్హతలు వున్నాయి."
 
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు చేసిన ఆత్మార్పణను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని యువత ఈ రోజు స్మరించుకుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితుల్ని తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలం కావడంపై వారి స్ఫూర్తితో పోరాడుతుంది. నిస్వార్థంగా, సాహసోపేతమైన ఆ ముగ్గురి త్యాగాలని స్మరించుకుంటూ జనసేన వారికి సెల్యూట్ చేస్తోంది. జై హింద్ అంటూ పవన్ కళ్యాణ్ ఓ లేఖను ట్విట్టర్లో జత చేశారు.