శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (12:02 IST)

పవన్ ఇపుడు చెడ్డోడా? ఢిల్లీలో చేస్తున్నది పొలిటికల్ డ్రామా: తమ్మారెడ్డి (వీడియో)

సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, అధికార టీడీపీ, విపక్ష వైకాపా ఎంపీలు ఢిల్లీలో చేస్తున్నది పొలిటికల్ డ్రామా అంటూ ఆయన ఆరోపించారు.

సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, అధికార టీడీపీ, విపక్ష వైకాపా ఎంపీలు ఢిల్లీలో చేస్తున్నది పొలిటికల్ డ్రామా అంటూ ఆయన ఆరోపించారు. 
 
అదేసమయంలో జనసేన అధినేక పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీకి ఇన్నిరోజులు నచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? అని ప్రశ్నించారు. పవన్ వెనుక బీజేపీ ఉందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నారా లోకేశ్‌పై పవన్ ఆరోపణలు చేయడం మాత్రం సబబు కాదని అన్నారు.
 
ఇకపోతే, ఏపీకి ప్రత్యేకహోదాపై ఏపీ ఎంపీలందరూ ఢిల్లీలో చేస్తోంది పొలిటికల్ డ్రామా అని విమర్శించారు. రాజకీయంగా పైచేయి కోసమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రకటన చేశారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి వస్తే సినీ పరిశ్రమ కూడా కలిసి వస్తుందని అన్నారు. తమ్మారెడ్డికి సంబంధించిన తాజా వీడియోను మీరూ చూడండి.