శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (11:05 IST)

బీజేపీతో వ్యభిచారం చేసింది మీరు... టీడీపీపై కత్తి మహేష్ ట్వీట్

అధికార తెలుగుదేశం పార్టీపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ విమర్శల వర్షం కురిపించాడు. భారతీయ జనతా పార్టీతో వ్యభిచారం చేసింది తెలుగుదేశం పార్టీయేనంటూ మండిపడ్డారు. నిజానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

అధికార తెలుగుదేశం పార్టీపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ విమర్శల వర్షం కురిపించాడు. భారతీయ జనతా పార్టీతో వ్యభిచారం చేసింది తెలుగుదేశం పార్టీయేనంటూ మండిపడ్డారు. నిజానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే కత్తి మహేష్‌కు అస్సలు పడదు. కానీ, గత కొంతకాలంగా ఆయనపై ప్రేమ చూపిస్తున్నారు. తాజాగా కూడా పవన్‌ను వెనకేసుకుని వచ్చి, టీడీపీపై విమర్శల వర్షం కురిపించాడు. 
 
'గ్లోబల్ టెర్రర్ విషయంలో అమెరికా అందర్నీ భయపెట్టేది. మీరు మాతో కలిసి రాకపోతే, మిమ్మల్ని కూడా టెర్రరిస్టులుగా పరిగణిస్తాం అని. అదే పద్ధతి తెలుగుదేశం అవలంభిస్తోంది. మాతో లేకపోతే మీరు బీజేపీ ఏజెంట్లు అని. బీజేపీతో వ్యభిచారం చేసింది మీరు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ని జగన్‌ని అంటే ఎట్లా!' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశాడు.