శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (10:46 IST)

మిస్టర్ పవన్ కళ్యాణ్.. గాలివి పోగుజేసి మాట్లాడొద్దు: వర్ల రామయ్య

రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై విమర్శ

రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై విమర్శలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నారు. మిస్టర్ పవన్ కల్యాణ్.. ఇప్పటికైనా నీ దగ్గర వాస్తవాలు, ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప, గాలివి పోగుజేసి మాట్లాడొద్దు అంటూ హెచ్చరిక చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 'నువ్వు (పవన్ కల్యాణ్) చేసిన వ్యాఖ్యలు సరైనవే అయితే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర సీడీని తన కారులో ఉంచుకునేవాడిని. లోకేశ్‌పై ఆరోపణలు చేసి.. ఆ తర్వాత వాళ్లెవరో చెప్పారు.. అక్కడ విన్నా.. ఇక్కడ విన్నా అని మాట్లాడావు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు ప్రభుత్వంపై తొందరపడి చేసిన వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు వెంటే నడుస్తా, మోడీ మెడలు వంచైనా సరే, ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని నువ్వు (పవన్ కల్యాణ్) చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.