ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (17:20 IST)

మోడీ అంటే వ్యక్తిగతంగా ఇష్టం.. నా వెంట ప్రజలున్నారు.. బీజేపీ కాదంటున్న హీరో (Video)

తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందని చెప్పారు.

తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందని చెప్పారు. 
 
ఆయన మంగళవారం ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బాగా బలహీనపడిందన్నారు. పైగా, తాను జనం కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నానని, జనం సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చారు. 
 
తనకు సినిమాల్లో నటించడం కంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనే అమితానందం లభిస్తుందన్నారు. అందువల్ల ప్రజల కోసం, ప్రజా సమస్యలపై తాను పోరాడతానని అన్నారు. పైగా, తన వెంట బీజేపీ లేదా వైకాపా లేదని, కేవలం ప్రజలు మాత్రమే ఉన్నారనీ, వారికోసమే తాను మాట్లాడుతున్నట్టు పవన్ చెప్పారు. 
 
కాగా, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్‌పై టీడీపీ నేతలు ముప్పేట విమర్శల దాడిచేస్తున్న విషయం తెల్సిందే. బీజేపీ డ్రామాలో భాగంగానే పవన్.. టీడీపీ నేతలపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడుతున్నారు. బీజేపీతో పవన్ ములాఖత్ అయ్యారని, వైసీపీ, బీజేపీ, పవన్ ముగ్గురూ కుమ్మక్కై టీడీపీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.