మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (09:59 IST)

పవన్ ప్రత్యేక హోదాకు కట్టుబడివున్నారు : జనసేన ప్రకటన

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాట మార్చలేదనీ, ప్రత్యేక హోదాకు కట్టుబడివున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. న్యూస్ 18 అనే ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్ర

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాట మార్చలేదనీ, ప్రత్యేక హోదాకు కట్టుబడివున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. న్యూస్ 18 అనే ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అనేది ముఖ్యంకాదనీ, ఆర్థికంగా చేయూతనిచ్చేలా పుష్కలంగా నిధులు ఇవ్వాలని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై టీడీపీ నేతలు, మంత్రులు మండిపడ్డారు. పవన్ మాట మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ అంశంపై వివరణ ఇచ్చింది. 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు జనసేన కట్టుబడి ఉంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని న్యూస్ 18 రిపోర్టర్ పొరపాటుగా అర్థం చేసుకున్నారు' అంటూ అందులో వివరించారు.