బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (18:53 IST)

పవన్ కళ్యాణ్ ఓ జోకర్ : మంత్రి జవహర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఒక జోకరంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఏపీ అబ్కారీ శాఖామంత్రి జవహర్. రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్‌ ఏదేదో మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఒక జోకరంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఏపీ అబ్కారీ శాఖామంత్రి జవహర్. రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్‌ ఏదేదో మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ గురించిగానీ, చంద్రబాబునాయుడు గురించిగానీ అసలు పవన్ కళ్యాణ్‌‌కు ఏం తెలుసునని ప్రశ్నించారు. 40 యేళ్ళ సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే పవన్ కళ్యాణ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదన్నారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై నిరంతర పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్‌ తప్పుపట్టడం మంచిది కాదన్నారు. తన పార్టీలోని నేతలను సక్రమ మార్గాలను పవన్ కళ్యాణ్‌ నడిపించుకోవాలే తప్ప ఇతర పార్టీల నాయకులను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తిరుమలలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం తాను చేస్తున్న పోరాటాన్ని చెప్పుకొచ్చారన్నారు మంత్రి జవహర్.