బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (18:51 IST)

అన్న చొక్కా పట్టుకుని అప్పుడే ప్రశ్నించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా పవన్...?

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు. విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్‌ చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీకి పోయేకాలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. 
 
ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందని నాని అన్నారు. అలాగే సభను ఆర్డరులో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని నాని అన్నారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. అన్న కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర విభజన జరిగింది. కుటుంబంలో అన్నని ప్రశ్నించలేని వాడు.. ఎవరిని ప్రశ్నిస్తాడు. అన్ననే చొక్కా పట్టుకుని అడిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదని నాని హితవు పలికారు.