శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (17:13 IST)

ప్రత్యేక హోదా కట్టుబడివున్నాం : జనసేన ప్రకటన

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రత్యేక హోదాకు ఇవ్వాలన్న డిమాండ్‌కు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కట్టుబడివున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశంపై ఆ పార్టీ ఓ ప్రకటన చేసింది.

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రత్యేక హోదాకు ఇవ్వాలన్న డిమాండ్‌కు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కట్టుబడివున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశంపై ఆ పార్టీ ఓ ప్రకటన చేసింది. హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చాలని పవన్‌కల్యాణ్‌ మరోమారు డిమాండ్‌ చేశారు. 
 
జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయించారని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి సున్నితమైన సమయంలో అభిప్రాయాలను ఎవరూ వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏది అవసరమో, ఏవి ఇస్తామని మాటిచ్చారో అవి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా, చట్టప్రకారం రావాల్సిన నిధుల విషయంలో తాను చెప్పిన మాటలను తప్పుగా అన్వయించారన్నారు. 
 
ప్రజలు, జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించి అర్థం చేసుకున్నారన్నారు. రాష్ట్రానికి నిధులిస్తే సరిపోతుందని తానెప్పడూ చెప్పలేదని, మంగళవారం ప్రసారమైన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా విషయంలో తాను చెప్పిన అభిప్రాయాలను పత్రికలు, ప్రసార మాధ్యమాలు వక్రీకరించాయని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.