మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 22 మార్చి 2018 (17:27 IST)

పవన్ కళ్యాణ్‌‌కు - మోడీకి పెళ్లి చేశారు... ఎక్కడ.. ఎవరు?

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం అట్టుడుగుతున్న విషయం తెలిసిందే. హోదా కోసం అధికార తెలుగుదేశంపార్టీతో పాటు మిగిలిన పార్టీ నేతలందరూ కూడా కలిసికట్టుగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను పక్కనబెట్టుకుని

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం అట్టుడుగుతున్న విషయం తెలిసిందే. హోదా కోసం అధికార తెలుగుదేశంపార్టీతో పాటు మిగిలిన పార్టీ నేతలందరూ కూడా కలిసికట్టుగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను పక్కనబెట్టుకుని హోదా వస్తే ఏంటి లాభం.. రాకుంటే ఎలాంటి నష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయడమే కాకుండా శాంతియుతంగా ఆందోళన చేయాలని కూడా పిలుపునిచ్చారు.
 
ఇదంతా జరుగుతుండగానే నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్‌ ఒక బహిరంగ సభను పెట్టారు. ఆ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, నారా లోకేష్‌‌లను ఏకిపారేశారు. దీంతో టిడిపి నేతలందరూ పవన్  కేంద్రానికి దగ్గరవుతున్నారు.. కేంద్రంలోని నేతల కనుసన్నల్లోనే జనసేన నడుస్తోందని కూడా ఎవరికి వారు చెబుతూ వచ్చారు. 
 
దీంతో తెలుగుదేశంపార్టీకి చెందిన శ్రీకాళహస్తి నేతలు పవన్ కళ్యాణ్‌‌కు - మోడీకి పెళ్ళి చేశారు. అది కూడా శ్రీకాళహస్తిలోని పెళ్ళి మండపానికి ఎదురుగానే. స్వామి, అమ్మవార్లకు వివాహం చేసే చోట పవన్ కళ్యాణ్‌, మోడీల దిష్టిబొమ్మలను తయారుచేసి వివాహం చేశారు. బిజెపి పెద్దలను పవన్ కళ్యాణ్‌ వివాహం చేసుకున్నట్లు మంత్రాలు కూడా చదివారు. ఇదంతా చూస్తున్న స్థానికులు నవ్వుకున్నారు.