బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: సోమవారం, 26 మార్చి 2018 (14:57 IST)

అవినీతి కేసుల్లో A2 విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో కాలు మీద కాలేసుకుని కూర్చోవడమా(Video)

భాజపా-తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరింత హీటెక్కిస్తున్నాయి. అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడుగా వున్న విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయంలో కాలు మీద కా

భాజపా-తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరింత హీటెక్కిస్తున్నాయి. అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడుగా వున్న విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయంలో కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చోగలిగాడో నాకైతే అర్థం కావడం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. తమ ఎంపీలు వెళితే కనీసం గేటు కూడా తీయని ప్రధాని కార్యాలయం అవినీతి కేసులో నిందితుడుగా వున్న ఓ వ్యక్తికి ఎలా అనుమతి ఇస్తున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. 
 
ఈ విషయంలో నటుడు శివాజీ చెప్పింది నిజమేనేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. పరిస్థితులు చూస్తుంటే తమపై టార్గెట్ పెట్టేందుకు కేంద్రం చూస్తోందా అనే అనుమానం వస్తోందన్నారు. ఒక పక్క అవినీతి పార్టీని అక్కున చేర్చుకుని, మరోవైపు మిత్రపక్షమైన మమ్మల్ని దూరం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వారి వ్యవహార శైలి చూస్తుంటే ఇటీవలే నటుడు శివాజీ వ్యాఖ్యానించినవి నిజమేనేమోనన్న అనుమానం వస్తుందన్నారు.
 
ఇక వచ్చే 2019 ఎన్నికల్లో తమదే విజయమని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 150 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుని తీరుతుందని చెప్పుకొచ్చారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ స్టామినా ఎలా వుంటుందన్నది చూడాల్సిందే. ఈ వీడియో చూడండి నారా లోకేష్ మాటల్లోనే...