1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. AP IT Minister Nara Lokesh comments on his family income

పాలు - కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామంటున్న సీఎం సన్

తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు.

Nara Lokesh
తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో తాగునీటి ట్యాంకర్లలో అవినీతి జరుగుతోందని బీజేపీ పక్షనేత సోము వీర్రాజు ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. 
 
అలాగే తన శాఖలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడం లేదన్నారు. తన కుటుంబం పాలు, కూరగాయలు అమ్మి డబ్బు సంపాదిస్తోందని.. చివరికి తన క్రెడిట్‌ కార్డు బిల్లు కూడా వారే కడతారని చెప్పారు. తన శాఖలో అవినీతి జరుగుతున్నట్లు ఆధారాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. 
 
అలాగే, విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలకు నింబంధనల ప్రకారమే సంస్థలకు భూములు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేస్తున్న వారు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చినా... 21 రోజుల్లోనే భూములు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి బయట ఉన్న పార్టీ సభ్యులు, లోపలే ఉండి విమర్శలు చేస్తున్న సభ్యులు తెలుసుకునేందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని అన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'భగత్ సింగ్'తో వాళ్ల అమ్మ ఏమన్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ లేఖ