1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. BJP leader Sudhir Rambotla respond on Actor Sivaji's Operation Dravida

ఆపరేషన్ ద్రవిడ.. ఓ ఫ్లాప్ హీరో ఊహాజనితం.. నిజమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కలిసి దక్షిణ భారతదేశంలో బీజేపీని విస్తరింపజేసేందుకు ఆపరేషన్ ద్రవిడను చేపట్టినట్టు టాలీవుడ్ సినీ హీరో శివాజీ గురువారం ప్రటించారు.

Operation Dravida
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కలిసి దక్షిణ భారతదేశంలో బీజేపీని విస్తరింపజేసేందుకు ఆపరేషన్ ద్రవిడను చేపట్టినట్టు టాలీవుడ్ సినీ హీరో శివాజీ గురువారం ప్రటించారు. ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలంగా మారింది. ముఖ్యంగా, ఏపీలో ఉన్న పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేసేందుకు ఓ జాతీయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
 
ఈనేపథ్యంలో శివాజీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆపరేషన్ గరుడ, ద్రవిడ అనేవి అవాస్తవాలని... ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథనాలని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల అన్నారు. టీడీపీ నేతలు ఇటీవలి కాలంలో కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడని... ప్రధాని కార్యాలయంలో ఆయన తిరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
 
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా అవాస్తవాలని సుధీశ్ రాంభొట్ల అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు చాలా గొప్పదని... అయితే, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది మాత్రం వాస్తవమన్నారు. చంద్రబాబు నాయుడు నిజంగా రాయలసీమ బిడ్డే అయితే... సీమను ఎందుకు అభివృద్ధి చేయలేదని సుధీర్ రాంబొట్ల నిలదీశారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అన్నా హజారే మళ్లీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు... ఎవరి కోసమో తెలుసా?