శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (16:09 IST)

మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం : రంగంలోకి దిగిన కాంగ్రెస్

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరుకు దిగింది. ఇందులోభాగంగా, ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరుకు దిగింది. ఇందులోభాగంగా, ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో ఇచ్చారు. ఈ నోటీసు ఈనెల 27వ తేదీన చర్చకు వచ్చే అవకాశం ఉంది.
 
నిజానికి మోడీ సర్కారుపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, విపక్ష వైకాపాలు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూ వస్తున్నారు. గత శుక్రవారం నుంచి ఇదే తంతు జరుగుతోంది. అయితే సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నోటీసులను తోసిపుచ్చుతూ, సభను వాయిదా వేస్తూ వచ్చారు. 
 
ఈనేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి వచ్చింది. ఈనెల 27న కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. మంగళవారం చేపట్టే బిజినెస్ కార్యక్రమాల్లో తామిచ్చే అవిశ్వాస తీర్మానం నోటీసును చేర్చాలని ఆ నోటీసులో ఖర్గే కోరారు. 
 
కాగా, సభ ఆర్డర్‌లో లేదంటూ వరుసగా విపక్షాల అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండానే ఉభయసభలూ వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం అవిశ్వాస తీర్మానంతో బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది. ఈసారైనా అవిశ్వాస తీర్మానాలపై చర్చ పార్లమెంటులో చోటుచేసుకుంటుందా? నిరవధిక వాయిదాతో అవిశ్వాస తీర్మానాలను కేంద్రం అటకెక్కించేస్తుందా అనేది చూడాలి.