శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By srinivas
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:37 IST)

త‌న వ్యాఖ్య‌ల‌తో ఎంపీల‌కే షాక్ ఇచ్చిన జెసీ దివాక‌ర్ రెడ్డి..(Video)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ తెలుగుదేశం ఎంపీలు గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ నిర‌స‌న తెలియ‌చేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్ర మాత్రం స్పందించ‌డం లేదు. తెలుగుదేశం ఎంపీలు రోజుకో రీతిలో

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ తెలుగుదేశం ఎంపీలు గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ నిర‌స‌న తెలియ‌చేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్ర మాత్రం స్పందించ‌డం లేదు. తెలుగుదేశం ఎంపీలు రోజుకో రీతిలో త‌మ నిర‌స‌న తెలియ‌జేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. 
 
అయితే.. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండబ‌ద్ధలుకొట్టిన‌ట్టు మాట్లాడే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి త‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... తెలుగుదేశం ఎంపీలు గాంధీ ఘాట్‌ను సంద‌ర్శించిన నేప‌థ్యంలో ఓ విలేఖ‌రి గాంధీ ఘాట్‌కి వ‌చ్చి చాలా సంవ‌త్స‌రాలు అయిన‌ట్టుంది అని అన్నారు. 
 
దీనికి జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, అవును మేమంతా ఇప్పుడు గాంధీని మ‌ర‌చిపోయాం. చంద్ర‌బాబు పార్టీలో ఉన్నాం క‌దా. ఆయ‌న ఒక్క‌డే క‌దా ప్ర‌త్యేక హోదా గురించి సీరియ‌స్‌గా పోరాడుతున్నాడు అన‌గానే అక్క‌డున్న మిగిలిన ఎంపీలంద‌రూ ఖంగుతిన్నారు.