శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 5 ఏప్రియల్ 2018 (21:48 IST)

దానికి కారణం పవన్ కళ్యాణ్... ఆయన మాట్లాడితే సర్రున వెళ్తోంది... ఉండవల్లి

సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా చెపుతుంటారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ప్రజల్లోకి దూసుకు వెళ్లిపోతోందంటూ చెప్పుకొచ్చారు. పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస

సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా చెపుతుంటారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ప్రజల్లోకి దూసుకు వెళ్లిపోతోందంటూ చెప్పుకొచ్చారు. పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏపీలోని పాలక, ప్రతిపక్ష పార్టీలు పోటీపడుతున్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణే అని చెప్పారు. 
 
ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడితే ఆయనను నమ్మక ద్రోహి అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే ఇన్నేళ్లకు నీకు మెలకువ వచ్చిందా? అని మాట్లాడుతున్నారు.
 
అసలు నేను ఎప్పుడో చెప్పాను. పవన్ కళ్యాణ్ రిస్క్ చేస్తున్నారని. ఐతే ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం ఆయన చిత్తశుద్ధితో వచ్చినప్పుడు అంతా ఆయన వెనుక వుండి నడవాలి. అలా చేయకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నట్లవుతుందని అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.