శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:10 IST)

ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్తేనే ప్రత్యేక హోదా సాధ్యం : మాజీ సీఎం కె.రోశయ్య

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఇపుడు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు సరిపోవని ఎవరూ ఊహించని స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తేనే అది సాధ్యపడుతుందని మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఇపుడు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు సరిపోవని ఎవరూ ఊహించని స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తేనే అది సాధ్యపడుతుందని మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. తన వ్యక్తిగత పనుల మీద విజయవాడకు వచ్చిన కె.రోశయ్యను ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న కలిశారు. ఈ సందర్భంగా తాము చేస్తున్న హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని ఈ మాజీ గవర్నర్‌ను వెంకన్న కోరారు. 
 
దీనికి కె.రోశయ్య స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే, ఇప్పుడు చేస్తున్న ఉద్యమాలు, తెలుపుతున్న నిరసనలు సరిపోవన్నారు. హోదా ఉద్యమాన్ని ఎవరూ ఊహించనంత ఉద్ధృత స్థాయికి తీసుకు వెళితేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉండాలని హితవు పలికారు.