శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 9 ఏప్రియల్ 2018 (22:12 IST)

రాహుల్‌కు జనసేన సెల్యూట్ చేస్తుంది... రూ. 10 లక్షలు ఇస్తుంది... పవన్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిప్టింగ్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్‌కు నజరానా ప్రకటించారు. రాహుల్ ఎంతో కృషి చేసి భారతదేశం గర్వపడేలా చేసినందుకు ఆయనకు ప్రోత్సాహకంగా రూ. 10 లక్షలను జనసే

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిప్టింగ్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్‌కు నజరానా ప్రకటించారు. రాహుల్ ఎంతో కృషి చేసి భారతదేశం గర్వపడేలా చేసినందుకు ఆయనకు ప్రోత్సాహకంగా రూ. 10 లక్షలను జనసేన ఇస్తుందని తెలిపారు.
 
రాహుల్‌కు పవన్ కల్యాణ్‌ అభినందనలు తెలుపుతూ... రాగాల వెంకట రాహుల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి మాతృభూమి భారత్‌ గర్వపడేలా చేశారు. ప్రోత్సాహకంగా మా పార్టీ రూ. 10 లక్షల చెక్ ఇస్తుంది. నీ అత్యద్భుత విజయం పట్ల గర్వపడుతున్నాం. జనసేన పార్టీ నీకు సెల్యూట్ చేస్తోంది.. జై హింద్ అంటూ పేర్కొన్నారు పవన్.