శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (14:40 IST)

నేను ఆయన మనిషిని... ఆయన జనసేన అంటే నాది కూడా జనసేనే : అల్లు అర్జున్

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్‌ఫుల్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఈయన తాజాగా "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే, మెగా ఫ్యామిలీ హీరోగా ముద్రవేయించుకున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్‌ఫుల్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఈయన తాజాగా "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే, మెగా ఫ్యామిలీ హీరోగా ముద్రవేయించుకున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తున్నారు. చిరంజీవి మాటే వేదం. అందుకే చిరంజీవి ఏ దారిలో వెళితో ఆ దారిలో వెళుతుంటారు. 
 
తాజాగా రాజకీయాలపై అల్లు అర్జున్ స్పందించారు. చిరంజీవిగారు ఏ పార్టీ అంటే అదే నా పార్టీ అని తేల్చి చెప్పారు. 'నేను రాజకీయాల గురించి మాట్లాడాలంటే.. ముందు చిరంజీవిగారు రాజకీయాల గురించి ఏం చెబుతారో, ప్రస్తుత రాజకీయాలపై ఆయన అభిప్రాయం ఏమిటో తెలియాలి. ఎందుకంటే చిరంజీవిగారిది ఏ పార్టీ అయితే నాది కూడా అదే పార్టీ అని ఆయన ఒక్కముక్కలో తేల్చిపారేశారు. 
 
ఇకపోతే, ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ కాదని.. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్ధతు తెలుపుతూ.. జనసేన అంటే నాది కూడా జనసేనే. నేను ఆయన మనిషిని. చిరంజీవిగారు ఏం చెబితే అదే నా మాట. నాకంటూ పొలిటికల్ స్టాండ్ ఏమీ లేదు. చిరంజీవిగారి దారే నాదారి' అని తేల్చిచెప్పారు. 
 
కాగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు.. చిరు వెన్నంటే ఉండి సపోర్ట్ చేసిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆ పార్టీ ప్రచారం కోసం అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు కలిసి ప్రచారం చేశారు. ఇక ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత అల్లు అర్జున్ రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇపుడు హీరో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టడంతో ఇపుడు అల్లు అర్జున్ పాల్గొనే విలేకరుల సమావేశాల్లో రాజకీయ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.