శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (12:27 IST)

సమంతకు పెళ్లైందంటే.. చిరంజీవి అలా అన్నారు: సుకుమార్

''రంగస్థలం'' చిత్రం సినీ యూనిట్‌కు కనకవర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో నటించిన నటులకు ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించిపెడుతోంది. దర్శకనిర్మాతలకు కనకవర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర హీర

''రంగస్థలం'' చిత్రం సినీ యూనిట్‌కు కనకవర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో నటించిన నటులకు ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించిపెడుతోంది. దర్శకనిర్మాతలకు కనకవర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అయిన సమంతకు కూడా రంగస్థలం మరో రికార్డును సాధించిపెట్టింది. సమంత కెరీర్‌లో ఎనిమిదవ వంద కోట్ల మూవీగా రంగస్థలం నిలిచింది. 
 
తమిళ, తెలుగు భాషల్లో క్రేజున్న హీరోయిన్లలో ఒకరైన సమంత కెరీర్‌లో వందకోట్లకు చేరిన సినిమాలు చాలానే వున్నాయి. ఇందులో చెర్రీతో కలిసి నటించిన ''రంగస్థలం'' వంద కోట్ల కలెక్షన్లు సాధించిన 8వ సినిమాగా రంగస్థలం నిలిచింది. గతంలో సమంత నటించిన 24, కత్తి, తెరి, మెర్సల్, దూకుడు, అత్తారింటికి దారిది, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాయి. తాజాగా రంగస్థలం కూడా ఆ జాబితాలో చేరిపోయింది. 
 
అంతేగాకుండా రంగస్థలం థ్యాంక్స్ మీట్‌లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. రంగస్థలం సినిమా కోసం నటీనటుల ఎంపికలో భాగంగా సమంతను సెలెక్ట్ చేశామన్నారు. అయితే సమంతకు పెళ్లైపోయిందని.. ఆమెను రంగస్థలం హీరోయిన్‌గా తీసుకుంటే.. ప్రేక్షకులు పెద్దగా ఆదరించరని కొందరు తన వద్ద చెప్పారన్నారు. 
 
కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. సమంతకు పెళ్లైందనే విషయాన్ని పక్కనబెట్టండి. ఆమె ఉత్తమ నటీమణి. రంగస్థలం కోసం సమంతను తీసుకోమన్నారని సుకుమార్ తెలిపారు. మెగాస్టార్ చెప్పడంతో పాటు నటనాపరంగా ఆ పాత్రకు సమంతనే కరెక్ట్ అనుకుని.. పెళ్లైనా ఆమెను రంగస్థలం కథానాయికగా ఎంపిక చేశామని సుకుమార్ చెప్పారు.
 
ఇకపై హీరోయిన్ల ఎంపికలో వారికి పెళ్లైందా లేదా అనే స్టేటస్‌ను పెద్దగా తీసుకోవద్దని.. సుకుమార్ దర్శకనిర్మాతలకు సూచించారు. పెళ్లైనప్పటికీ తన అద్భుత నటనతో రంగస్థలం ద్వారా సమంత తన ఖాతాలో బంపర్ హిట్‌ను సొంతం చేసుకుందని సుకుమార్ గుర్తు చేశారు. ఇకపోతే.. గత ఏడాది అక్టోబర్‌లో తన ప్రేమికుడు కింగ్ నాగార్జున కుమారుడు.. అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. వివాహమైనా షార్ట్ బ్రేక్ తీసుకున్న సమంత రంగస్థలం షూటింగ్‌లో పాల్గొన్న సంగతి విదితమే.