సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (17:33 IST)

అఫ్రిది కుటుంబానికి కాశ్మీర్ ఉగ్రకార్యకలాపాల్లో సంబంధాలున్నాయట?!

భారత్‌పై పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అక్కసు వెళ్లగక్కేందుకు కారణం వుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటూ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న అఫ్రిది, త్వరలోనే రాజకీయా

భారత్‌పై పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అక్కసు వెళ్లగక్కేందుకు కారణం వుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటూ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న అఫ్రిది, త్వరలోనే రాజకీయాల్లో రానున్నాడని సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయంగా అతడి క్రికెట్ కెరీర్‌ ముగియడంతో పాక్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని షాహిద్ అఫ్రిది మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇందులో భాగంగా ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌తో పలుమార్లు భేటీ అయినట్లు తెలుస్తోంది. 
 
నిజానికి చెప్పాలంటే 2013 నుంచే రాజకీయాల్లోకి రావాలని షాహిద్ అఫ్రిది ప్రయత్నాలు చేశాడట. అయితే అతనికి రాజకీయ అరంగేట్రానికి తగిన సమయం దొరకలేదని సమాచారం. అందుకే భారత్‌పై అతడు విమర్శలు గుప్పిస్తున్నాడటని.. అతని బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే.. అఫ్రిది కుటుంబీకులందరికీ తరతరాలుగా భారత్‌పై కోపం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
అందుకే ఆ కోపాన్ని అదే కుటుంబం నుంచి వచ్చిన అఫ్రిది కూడా భారత్‌పై విమర్శలు చేస్తున్నాడు. అంతేకాదు అఫ్రిది కుటుంబానికి కాశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయి. అతని దగ్గరి బంధువు షకీబ్‌ను 2003లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో బీఎస్‌ఎఫ్ మట్టుబెట్టింది. అందుకే భారత్ అంటే అఫ్రిదికి కోపమని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
 
1947 947లో అప్పటి పాక్ సైనికాధికారి అక్బర్ ఖాన్ నేతృత్వంలో గిరిజనులైన అఫ్రిదీ, వాజీర్, మసూద్, తెరి తెగలు కాశ్మీర్‌పై దండెత్తాయి. అఫ్రిదీలు దోపిడీలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. వీరి ఆగడాలను భరించలేని కాశ్మీర్ రాజు హరిసింగ్ భారత్‌ను ఆశ్రయించడంతో భారత దళాలు రంగంలోకి దిగి వారిని తరిమికొట్టాయి. అప్పటి నుంచే అఫ్రిది తెగ భారత్‌పై ద్వేషం పెంచుకుంది.
 
అది ఇప్పటికీ షాహిద్ అఫ్రిది మాటల్లో బయటపడుతూనే ఉంది. ట్వంటీ-20 ప్రపంచకప్ ఆడేందుకు రెండేళ్ల క్రితం భారత్ వచ్చినప్పుడు కూడా షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌పై కారుకూతలు కూశాడు. కాగా కాశ్మీర్ విషయంలో అఫ్రిది నోరు పారేసుకోవడం వెనక అసలు కథ రాజకీయమేనని, షాహిద్ అఫ్రిది త్వరలోనే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ (ఎన్)లో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి.