కాశ్మీర్‌పై నోరుపారేసుకున్న అఫ్రిది.. దిమ్మదిరిగే బదులిచ్చిన గంభీర్, కోహ్లీ
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ఆక్రమిత కాశ్మీర్‌లో ఇంత హింస చోటుచేసుకుంటున్నా.. ఐక్యరాజ్యసమితి కానీ.. ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ ఎందుకు మౌనంగా వ
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ఆక్రమిత కాశ్మీర్‌లో ఇంత హింస చోటుచేసుకుంటున్నా.. ఐక్యరాజ్యసమితి కానీ.. ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ ఎందుకు మౌనంగా వుంటున్నాయని షాహిద్ అఫ్రిది ప్రశ్నించాడు. కాశ్మీర్‌లో మానవ హక్కులను కాలరాస్తున్నారని.. అమాయకులను హతమారుస్తున్నారని అఫ్రిది మండిపడ్డాడు. స్వాతంత్ర్యం కోరుకుంటున్న కాశ్మీరీల నోళ్లను మూయించేందుకు భారత సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోందని అఫ్రిది ఫైర్ అయ్యాడు.
కాగా కాశ్మీర్ విషయంలో భారత సైన్యంపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.అఫ్రిదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గంభీర్‌ను మీడియా ప్రశ్నించగా గంభీర్ స్పందించాడు.
అఫ్రిది ట్వీట్‌పై తనను స్పందించాలని టీమిండియా స్పందించాలని మీడియా కోరుతోంది. దానిపై ఏం కామెంట్ చేయాలి.. అఫ్రిది ఐరాసను స్పందించమంటున్నాడు. బుద్ధిమాంద్యం ఉన్న అఫ్రిదీ దృష్టిలో యూఎన్ అంటే అండర్ నైన్టీన్ అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌కు అవుట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడంటూ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు.
షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. షాహిద్ మాటల్లో కరెక్షన్ వుందని.. భారత ఆక్రమిత కాశ్మీర్ కాదని.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ అనాలని గుర్తు చేశాడు. భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమనే విషయాన్ని అఫ్రిది గుర్తు చేసుకోవాలన్నాడు.