సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (17:20 IST)

సీఎం చంద్రబాబు దీక్ష పేరు 'ధర్మపోరాట దీక్ష'

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం చేస్తున్న

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఈనెల 20వ తేదీన పుట్టినరోజు సందర్భంగా ఆయన నిరాహారదీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసన తెలపడానికి తన పుట్టిన సందర్భంగా నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ఈ దీక్షకు 'ధర్మపోరాట దీక్ష' అనే పేరు పెట్టారు. 
 
'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా వినిపించనున్నారు. ఈ నిరశన దీక్ష ఉదయం 7 నుంచి (తొలుత ఉదయం 9 గంటల నుంచి చేయాలనుకున్నారు) రాత్రి 7 వరకు చేయాలని నిర్ణయించారు. ఆ రోజు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.