మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (18:46 IST)

ఒక్క ఫోన్ కాల్ చాలు... రాష్ట్రంలో కేంద్ర వాహనాలు ఒక్కటీ తిరగదు : చంద్రబాబు

తాను ఒక్క ఫోన్ కాల్ చేస్తే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క వాహనం రాష్ట్రంలో తిరగదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతిలో జరిగిన హ్యాపీ సిటీస్ సమిట్ ముగింపు కార్యక

తాను ఒక్క ఫోన్ కాల్ చేస్తే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క వాహనం రాష్ట్రంలో తిరగదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతిలో జరిగిన హ్యాపీ సిటీస్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. హ్యాపీ సిటీస్ ఇనువేటన్ ల్యాబ్‌ను ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ రోజున తాను ప్రభుత్వం తరపున ఒక్క కాల్ చేస్తే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఏ ఒక్కటీ రాష్ట్రంలో తిరగవని... తనకు ఒక నిమిషం పని అని అన్నారు. కానీ దానివల్ల జాతి ఎంతో నష్టపోతుందని, రాష్ట్రం డైవర్ట్ అయిపోతుందని అన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం... ఇప్పటికే అన్ని విధాలుగా కుంటుపడిందని, వేరే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో... రాష్ట్రం ఇంకా కుంటుపడితే మళ్లీ ఎప్పుడు లోటును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. విపక్షాలు రాజకీయ లబ్ది కోసం రెచ్చగొడుతున్నాయని, ఆ పద్ధతి సరైనది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
 
ఇకపోతే, కష్టాలను సవాళ్లుగా స్వీకరించడం భారతీయులకు తెలిసిన విద్య అని అన్నారు. భారత్‌లో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు నవ్వుతుంటారన్నారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఒక్కో కష్టాన్ని అధిగమిస్తూ వస్తున్నామని గుర్తు చేసిన చంద్రబాబు... జపాన్‌లో ఎన్నో సౌకర్యాలు, అవకాశాలు ఉంటాయి.. కానీ అక్కడి ప్రజల మొహంలో ఆనందం ఉండదని గుర్తు చేశారు.