శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (11:17 IST)

బాబుగారూ.. హోదాపై మీ నాటకాలు చాలు.. ఇక ఆపండి : కోట్ల సూర్య ప్రకాష్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ తమ పార్టీ నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. 
 
ఈ నాలుగేళ్లుగా నోరు మెదపని చంద్రబాబు ఇపుడు ప్రత్యేక హోదా పేరుతో సరికొత్త నాటలకు తెరతీయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రత్యేక హోదా పేరెత్తితే జైలుకు పంపుతామంటూ గతంలో చంద్రబాబు హెచ్చరించలేదా అని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిలదీశారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని దండుకున్నారని... ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో భజన కార్యక్రమాన్ని నిర్వహించారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అనేది ప్రాంతీయ పార్టీలతో రాదని... జాతీయ పార్టీలతోనే అది సాధ్యమవుతుందని కోట్ల అన్నారు.