మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (15:11 IST)

కాంగ్రెస్ నెత్తిన పాలుపోస్తున్న అమిత్ షాక్... ధన్యవాదాలంటూ ట్వీట్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ తరపున జాతీయ అధ్యక్షు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ తరపున జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు రంగంలోకిదిగి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అయితే, అమిత్ షా ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. అమిత్ షా ప్రచారం చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్వాగతిస్తారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పూర్తిగా తడబడున్నారు. ఆయన చేస్తున్న పొరపాట్లు కాంగ్రెస్ పాలిట మంచి ఆయుధాలుగా మారుతున్నాయి. అందుకే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అమిత్ షానే అని కాంగ్రెస్ నేతలు చలోక్తులు విసురుతున్నారు. 
 
దేశంలోనే అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం ఎడ్యూరప్పదే అని చెప్పి, ఆ తర్వాత అమిత్ షా నాలుక కరుచుకున్నారు. మరో బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇపుడు సిల్క్ ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉందని సీఎం యడ్యూరప్ సర్కారు పనితీరుకు అండగా నిలిచారు. అమిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి గరిష్టం స్థాయికి చేరుకుందని... ఈ విషయాన్ని అమిత్ షా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.