శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (11:51 IST)

#KarnatakaElections2018 : మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 స్థానాలు కలిగిన ఈ రాష్ట్ర శాసనసభకు మే 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ ఒకే దశలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 15వ తేదీన కౌంటింగ్ చేపడుతామని కే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 స్థానాలు కలిగిన ఈ రాష్ట్ర శాసనసభకు మే 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ ఒకే దశలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 15వ తేదీన కౌంటింగ్ చేపడుతామని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
మే 12న పోలింగ్, మే 15న కౌంటింగ్ జరుతుందని ఆయన తెలిపారు. కర్ణాటకలో మొత్తం ఓటర్లు 4.96 కోట్ల మంది ఉండగా అందులో పురుషుల ఓటర్లు 2.51 కోట్లు కాగా మహిళా ఓటర్లు 2.45 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా గట్టి బందోవస్తు ఏర్పాటు చేస్తామని, సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత బందోబస్తును పెంచడం జరుగుతుందన్నారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ముందస్తు సర్వేలు చెపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమేకాకుండా క్రితంసారి కన్నా సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంటుందని సీ-ఫోర్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలోని 154 నియోజకవర్గాల పరిధిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 25 మధ్య 22,357 మంది ఓటర్లను కలుసుకొని ఈ సర్వే నిర్వహించినట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 2,368 పోలింగ్ బూత్‌ల పరిధిలో సర్వే చేశామని, తమ అంచనా తప్పు కావడానికి కేవలం ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. 2013లో సీ-ఫోర్ సంస్థ కాంగ్రెస్‌కు 119-120 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఆ పార్టీ 122 సీట్లను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఓట్లు పెరిగి మొత్తం 46శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి 31 శాతం, జనతాదళ్ (సెక్యూలర్)కు 16శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది. 
 
224 మంది ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 126 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీకి కూడా సీట్లు పెరుగుతాయని, జేడీ(ఎస్) నష్టపోతుందని అంచనా వేసింది. బీజేపీ తన సీట్ల సంఖ్యను 40 నుంచి 70కి పెంచుకుంటుందని, జేడీ(ఎస్) స్కోరు మాత్రం 40 నుంచి 27కు తగ్గిపోతుందని తెలిపింది. ఇతరులకు ఏడు శాతం ఓట్లు లభిస్తాయని దీంతో వారికి కూడా ఒక సీటు లభిస్తుందని పేర్కొంది.